కాళోజీ అన్న పేరు చాలా రోజుల క్రితమే విన్నాను కానీ, ఆయనెవరో ఈ మధ్య వరకూ సరిగా తెలీదు...ఇప్పుడు కూడా పూర్తిగా తెలీదులెండి! బహుశా తెలంగాణా లో వుండేవాళ్ళకి బాగా తెలిసివుండొచ్చు. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో "పద్మ విభూషణ్" పొందిన ఆయన రచనాభాగాలేవీ పాఠాలుగా చదివిన గుర్తు లేదు. నిజంగానే అవి (ఇప్పటికీ) లేకపోతే, అది భాషా దురహంకారుల చేష్టలకి పరాకాష్ఠ అనే చెప్పుకోవాలి.
కాళోజీ చేసిన ఒక ఉపన్యాసంలోనుండి కొన్ని ముఖ్యాంశాలు:
కాళోజీ మొదట తెలుగు భాషాప్రవీణులైన పండితులతో తనకు జరిగిన అనుభవాలను పంచుకున్నారు. వారిలో విశ్వనాథ, శ్రీపాద కృష్ణమూర్తి, శేషాద్రి రమణ కవుల్లో రమణాచార్యులు మరియు రాంభట్ల కృష్ణమూర్తి ప్రముఖులు. వీరు వివిధ సమయాల్లో తెలంగాణా యాసని ఎద్దేవా చేశారు.
అసలు తెలంగాణావాళ్ళకి తెలుగే రాదనీ, తెలంగాణా భాషంతా "తౌరక్యాంధ్ర"మనీ రెండున్నర కోస్తా జిల్లావాళ్ళ దురహంకారం. పత్రికలు, సినిమాలు మరియు రాజకీయాలు చేతుల్లో వుంచుకొన్న రెండున్నర జిల్లాల్లో కొంతమంది మిగిలిన ప్రాంతపు వాళ్ళ యాసని తొక్కిపట్టి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించజూపారు...దానిలో చాలావరకూ సఫలీకృతులయ్యారు కూడా. ఇకనైనా ప్రజలు తమ ప్రాంతీయ భాష, యాసల ఉనికిని కాపాడుకోవాలి. ఇది ఒక్క తెలంగాణా ప్రాంతానికే పరిమితం కాకూడదు; రాయలసీమ, ఉత్తరకోస్తాల్లో కూడా అలజడి మొదలుపెట్టాలి.
పత్రికల్లో ప్రామాణిక భాష స్థాపించడమనేది ఒక కుట్ర. ఎవరి వాడుకభాషలో వాళ్ళు రాయాలి. మన రాత ఎదుటివాళ్ళకి అర్థం కాదేమోనన్న ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి. అసలు రాసేవాడూ, చదివేవాడూ ఇద్దరూ తెలుగోళ్ళయితే అర్థం కాకపొవడం వుండదు. తెలంగాణా భాష కేవలం రౌడీలు, పనిమనుషులే కాదు, జనసామాన్యం కూడా వాడుతుంది అని తెలియజెప్పాలి.
ప్రసంగ పూర్తి పాఠం ఈ క్రింద లింక్ లో చూడగలరు.
http://soyi.discover-telangana.org/mags/old/Kaloji_Telangana_Bhasha_Bathuku.pdf
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
meeru evaru? vivaraalu ceppagalaraa? naa mail id:
duppalaravi@gmail.com
thanks
-ravi
Post a Comment